పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: భారతదేశం

భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దుల్లో చారిత్రాత్మక విజయం సాధించింది. పాకిస్తాన్ కు చెందిన ప్రత్యేక మిషన్ ఎయిర్ క్రాఫ్ట్ భారత సరిహద్దుల వైపు రాగా, అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దానిని గుర్తించింది. సుమారు 314 కిలోమీటర్ల దూరాల నుంచి క్షిపణిని ప్రయోగించి, శత్రు విమానాన్ని క్షణాల్లో ధ్వంసం చేసింది. ఈ ఘటనతో భారత రక్షణ సామర్థ్యం ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది.