బాల్యవివాహాల నిర్మూలనపై గ్రామసభల తీర్మానాలు అభినందనీయం: ప్రగతి డైరెక్టర్ రమణ
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి అర్బన్
బాల్యవివాహాల నిర్మూలన లక్ష్యంగా దేశవ్యాప్తంగా అక్టోబర్ రెండున నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో గ్రామాలు ప్రతిజ్ఞ చేయడం అభినందనీయమని ప్రగతి సంస్థ డైరెక్టర్ కె.వి. రమణ ప్రశంసించారు. బాలికల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.