భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో నేడు సెలవు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కలెక్టరేట్లలో ప్రత్యేకంగా 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.