ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలను సాకారం చేస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: సతీష్
స్థలం: సిద్దిపేట
పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హుస్నాబాద్ లోని 12 వ వార్డులో నిర్వహించిన దీపావళి వేడుకల్ లో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, రెండో విడత లబ్ధిదారులకు త్వరలోనే ప్రొసీడింగ్స్ అందిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.