మెన్ గ్రీవెన్స్ డేలో కానిస్టేబుళ్ల సమస్యలు విన్న ఎస్పీ బిందుమాధవ్

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: కాకినాడ అర్బన్

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మెన్ గ్రీవెన్స్ డేలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు ఎస్పీ బిందు మాధవ్ను కలిసి బదిలీ అభ్యర్థనలపై దరఖాస్తులు సమర్పించారు. వారి సమస్యలను ఎస్పీ సావధానంగా విని, శాఖా నిబంధనలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత మేరకు సానుకూలంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.