రాయలసీమ ఉద్యాన హబ్‌కు శంకుస్థాపన: నేడే మదనపల్లిలో మెగా ప్రాజెక్టు ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: మదనపల్లి
లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమ రూపురేఖలు మార్చే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు మదనపల్లిలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే తొలి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కూడా పునాది రాయి వేయనున్నట్లు వెల్లడించారు. కరవు నేలను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు.