స్పీకర్‌ను అవమానించారు.. జన్నారంలో కాంగ్రెస్ నిరసన సెగ
రిపోర్టర్: p.g. murthy
స్థలం: జన్నారం
జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్‌ను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. స్పీకర్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వారు నినాదాలు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.