అన్నదాతల ఆక్రోశం: పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలంటూ చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
మురుసు తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయ అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.