తిరుమలలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి ప్రారంభాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుపతి

తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వద్ద పిలిగ్రిమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను, ఈవీ బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని సందర్శించి, శ్రీవారి ఆభరణాలు, త్రీడీ మోడల్స్, ఏఐ వీడియో ప్రదర్శనలను తిలకించారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు.