రోడ్డు ప్రమాదాల నివారణకు కడప పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం
రిపోర్టర్: సురేష్
స్థలం: వైఎస్ఆర్ కడప
రోడ్డు ప్రమాదాల నివారణకు కడప జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు కడప పోలీస్ శాఖ వెల్లడించింది. రాత్రి సమయాల్లో నిద్రమత్తు కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు స్టాప్, ఫేస్ వాష్, అండ్ గో నినాదంతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రధాన రహదారులు, కాలనీలు మరియు నిర్మానుష్య ప్రాంతాల్లో నైట్ పెట్రోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు సూచించారు.