వేబ్రిడ్జిల్ లో భారీ మోసాలు గుట్టురట్టు: తూనికల కొలతల శాఖ తనిఖీలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

వేబ్రిడ్జిల నిర్వాహకులు, దళారులు కుమ్మక్కై తూకాల్ లో మోసాలకు పాల్పడుతున్నట్లు తూనికల కొలతల శాఖ అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో రైతులు, వాహనదారుల ఫిర్యాదుల మేరకు అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి ఈ అక్రమాలను గుర్తించారు. ఖాళీ వాహనాల తూకం వేసే సమయంలో జిమిక్కులు చేసి మోసం చేస్తున్నట్లు నిర్ధారించి, నిబంధనలు ఉల్లఘించిన నాలుగు వేబ్రిడ్జిలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.