గొడ్డలి పార్టీ విమర్శలకు ఆధారాలతో దిమ్మతిరిగే సమాధానం చెప్పాలి: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని వక్రీకరిస్తోన్న గొడ్డలి పార్టీకి ఆధారాలతో దిమ్మతిరిగే సమాధానం చెప్పాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతిలో తెదేపా లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. హిట్‌, రన్‌, హైడ్‌ విధానమే ఆ పార్టీ వైఖరి అని మండిపడ్డారు. వాస్తవాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని జగన్‌ పార్టీకి చంద్రబాబు సవాల్‌ విసిరారు.