సిపిఎం నేతల అరెస్టు దుర్మార్గం: కేంద్ర సర్కార్పై వలిగొండలో వామపక్షాల నిరసన

రిపోర్టర్: BALUGURI VENKAHTAREDDY స్థలం: వలిగొండ

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొలగింపును కోరుతూ ఢిల్లీలో ఆందోళనకు బయలుదేరిన సీపీఎం జాతీయ నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో పార్టీ శ్రేణులు శనివారం నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా నాయకులు మద్దెల రాజయ్య, సిర్పంగస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. దేశంలో ఓట్ల తొలగింపునకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వెంటనే ఎన్నికల కమిషనర్ను తప్పించాలని వారు గళమెత్తారు.