గరివిడి లక్ష్మి చిత్రంపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రాణం పోసిన దిగ్గజ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సినిమా పాటలు, టీజర్ తనలో ఎంతగానో ఆసక్తిని రేకెత్తించాయని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా విడుదల కోసం సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు లోకేష్ తెలిపారు.