శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా: ఈ నెల పదహారుకు రీషెడ్యూల్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడినట్లు ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదానికి సంబంధించి రేపు జరగాల్సిన భేటీని ఈ నెల పదహారవ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమి పోరాటానికి మద్దతుగా సభ్యులు ఢిల్లీలో ఉండటంతో, కోరం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.