ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు అంటూ వైరల్ అవుతున్న నకిలీ వార్త

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

దేశంలోని అన్ని బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఆర్థిక సేవల విభాగం పేరుతో చలామణి అవుతున్న ఆ పత్రాన్ని నమ్మవద్దని పీఐబీ అధికారులు తెలిపారు. ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదన ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని, దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వారు స్పష్టం చేశారు.