ఢిల్లీ హోటల్ వేదికగా కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేల ఘర్షణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఢిల్లీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. ఢిల్లీలోని ప్రముఖ హోటల్ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆరోపించారు. డీసీసీ అధ్యక్ష పదవుల నియామకాల విషయంలో ఈ వివాదం తలెత్తిందని, మంత్రి తనను బెదిరించారంటూ ఆయన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్ లో తీవ్ర కలకలం రేపింది.