తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ స్థాయిలో అభినందనలు తెలిపిన సీఎం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. డ్రగ్స్ విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈగల్ ఫోర్స్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.