జీడిమెట్ల పరిధిలో విషాదం: ఫ్యాన్ కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

రిపోర్టర్: హరి స్థలం: జీడిమెట్ల

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భోళా శంకర్ నగర్ లో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో లావణ్య అనే పద్నాలుగేళ్ల విద్యార్థిని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులు సొంతూరికి వెళ్లగా పిన్ని వద్ద ఉంటూ చదువుకుంటున్న బాలిక, మంగళవారం ఒంటరిగా ఇంటికి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.