బెల్లంపల్లిలో మహర్షి వాల్మీకికి ఘనంగా నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని కోదండ రామాలయంలో మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి అంటే మహర్షి పేరు మాత్రమే కాదని, ఆయన గొప్ప ఆలోచనకు, పరివర్తనకు, స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. వాల్మీకి రామాయణం భారతీయ సంస్కృతికి మార్గదర్శకమని కొనియాడారు.