వందేభారత్ సహా పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసిన రైల్వే

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు సిర్పూర్ కాగజ్‌నగర్-బీదర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో తాత్కాలిక మార్పులు చేసింది. జత రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ సాయంత్రం 4:35 గంటలకు, సిర్పూర్ కాగజ్‌నగర్-బీదర్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5:20 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.