భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు రెండు రోజుల సెలవులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భారీ వర్షాలు మరియు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జిల్లా కలెక్టర్ అంకిత్ సెలవులు ప్రకటించారు. ఈ ఆదేశాలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలలకు వర్తిస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.