నెల్లూరు ఎంపీ వేమిరెడ్డిపై యూట్యూబ్ ఛానల్ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Nellore, Andhra Pradesh
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై 'ఫోర్త్ ఎస్టేట్' యూట్యూబ్ ఛానల్ తీవ్ర ఆరోపణలు చేసింది. తన అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, ఛానల్ సీఈవో గొల్లపూడిని అక్రమంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని సదరు ఛానల్ పేర్కొంది. ఈ వ్యవహారం నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.