టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోయినా వైభవ్ సూర్యవంశీకి పెద్దగా నష్టం లేదని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఆటగాళ్లతో కలిసి ప్రయాణించడం ద్వారా వైభవ్ ఎన్నో విషయాలు నేర్చుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. టెన్షన్ పడకుండా జట్టుతో ఉండడం భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని మోర్కెల్ స్పష్టం చేశారు.