ఉపాధ్యాయుడిపై దాడి ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే కొలికపూడి

రిపోర్టర్: శివ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

ఉపాధ్యాయుడిపై దాడి చేశారంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పాఠశాల పనితీరు, పదో తరగతి ఫలితాలపై సమీక్షించేందుకే ఉపాధ్యాయులను తన నివాసానికి పిలిపించానని, తాను ఎవరినీ భౌతికంగా కొట్టలేదని ఆయన తెలిపారు. అయితే దళిత ఉపాధ్యాయుడిపై దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపింది.