హైదరాబాద్‌లో వీడియో కాల్‌ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌ శాలివాహననగర్‌లో మలక్‌పేట పోలీస్ స్టేషన్ రైటర్‌ ముత్తె చంద్రశేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్‌ చేసి ఆయన ఉరివేసుకున్నారు. వెంటనే ఆ యువతి చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించగా వారు మలక్‌పేట పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.