వీక్షకులు క్రియేటర్ల అనుభవం కోసం నూతన ఫీచర్లు తెచ్చిన యూట్యూబ్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
న్యూయార్క్లో జరిగిన మేడ్ ఆన్ యూట్యూబ్ కార్యక్రమంలో వీక్షకులు, క్రియేటర్ల అనుభవాన్ని మెరుగుపరిచే పలు కొత్త ఫీచర్లను యూట్యూబ్ ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటికే మూడు వేలకు పైగా అప్డేట్లు విడుదల చేశామని, మరిన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయని సీఈవో నీల్ మోహన్ వెల్లడించారు. కస్టమ్ ఫీడ్స్, ఆస్క్ యూట్యూబ్ టూల్, ఆస్క్ స్టూడియో వంటి ఏఐ టూల్స్ను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.