తిరుపతి జిల్లాలో పోలీస్ చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు

రిపోర్టర్: మహేష్ స్థలం: Tirupati

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అన్ని పోలీస్ చెక్పోస్టుల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. శ్రీకాళహస్తి డిఎస్పి కె. నరసింహమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు మరియు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.