తెలుగు సినిమాలలో ఇప్పటివరకు రాని సరికొత్త పాత్ర జడల్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ చిత్రంలో జడల్ పాత్ర తెలుగు తెరపై ఇప్పటివరకు రాలేదని నాని తెలిపారు. 1984-85 కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మదర్ సన్ ఎమోషన్ ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని, మోహన్ బాబు విలన్ పాత్ర ప్రేక్షకులను షాక్కు గురిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.