మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మిక వార్షిక తనిఖీ నిర్వహించిన సీపీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందమర్రి
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గురువారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. సింగరేణి ప్రాంతంలో దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పోలీస్ సిబ్బందికి సీపీ సూచించారు.