పోతిరెడ్డిపాడు వద్ద తెగిన 9వ గేటు రోప్
రిపోర్టర్: సునీల్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ నంబర్ గేటును పైకి లేపుతుండగా లోహపు తీగ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో భారీ గేటు కిందకు కుప్పకూలింది. నిర్వహణ లోపమే కారణమని ఆందోళన వ్యక్తమవుతుండగా, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే కొత్త రోప్ అమర్చుతామని ఏఈ వెల్లడించారు.