సీఎం రేవంత్ రెడ్డితో నాకు ఎలాంటి గొడవల్లేవ్: మహేష్ కుమార్ గౌడ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం ఒక బీసీ బిడ్డగా తనకు బాధ కలిగించిందన్నారు. పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా అధిష్టానం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం కేబినెట్ విస్తరణ లేదని, పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.