దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: హరి స్థలం: India

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌లలోని ప్రసిద్ధ ఆలయాలు గణపతి నామస్మరణలతో మారుమోగుతున్నాయి. ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో దేశం పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.