ఏపీలో వినాయక నిమజ్జనానికి నీటి తిప్పలు తప్పడం లేదు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
ఏపీలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఎండిపోవడంతో వినాయక నిమజ్జనానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల నీరు లేక భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేసేదేం లేక క్షమించు దేవుడా అంటూ నిమజ్జనం చేయకుండానే విగ్రహాలను అలాగే వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. నీటి వనరులు లేకపోవడంతో వేడుకలు అసంపూర్తిగా ముగుస్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.