రాప్తాడు పాఠశాలలో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి
రిపోర్టర్: రమేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఓ వ్యక్తి రంపంతో దాడి చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ఘోర ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి తల్లితో ఫోన్ లో మాట్లాడి ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా కల్పించారు. నిందితుడిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.