బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ను అరెస్ట్ చేస్తారా అంటూ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. క్రిశాంక్ ఇంటి తలుపులు పగులగొట్టి, అక్రమంగా ఇంట్లోకి చొరబడి పోలీసులు అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న అక్రమ కేసులు, నిర్బంధ కాండలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాయకులు హెచ్చరించారు.