అమెరికా కొత్త విద్యార్థి వీసా నిబంధనలపై ఫెడరల్ కోర్టు స్టే

రిపోర్టర్: శివ స్థలం: USA

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల వీసా కాలపరిమితిని మారుస్తూ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలపై ఫెడరల్ కోర్టు తాత్కాలిక స్టే విధించింది. మసాచుసెట్స్ జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో వేలాది మంది భారతీయ విద్యార్థులకు తాత్కాలిక ఊరట లభించింది. కోర్సు కాలపరిమితిని కుదించడంపై హార్వర్డ్ సహా పలు యూనివర్సిటీలు కోర్టును ఆశ్రయించగా, తదుపరి విచారణ వరకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.