జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో ఈనాడు ఫొటోగ్రాఫర్లకు సముచిత పురస్కారాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో దేశవ్యాప్తంగా 60 మంది విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో ఈనాడు ఫొటోగ్రాఫర్లు ఇద్దరు సత్తా చాటారు. విజయవాడకు చెందిన ఎం.పి.ఎస్.కె.దుర్గాప్రసాద్ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికకాగా, ఒంగోలుకు చెందిన సి.మల్లికార్జున చిత్రం ఎక్సలెన్స్ అవార్డును దక్కించుకుంది. అక్టోబర్ 2న నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేయనున్నారు.