ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వెంటనే అమలు చేయాలని తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ డిమాండ్ చేశారు..ఆదివారం మంచిర్యాలలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 6 డీఏలు విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ వైద్య పరిమితి రూ.10 లక్షలకు పెంచాలని, అలాగే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9వ తేదీ లోపు సమస్యలను పరిష్కరించకపోతే, 10న తలపెట్టిన చలో హైదరాబాద్ ను ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు.