పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా సచిన్ పైలట్ నియామకం
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
పంజాబ్ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరడంతో అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ భూపేష్ సింగ్ బాఘేల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో సచిన్ పైలట్‌ను నియమించింది. గ్రూపు తగాదాలను తగ్గించడంలో బాఘేల్ విఫలం కావడంతో ఈ మార్పు జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం పైలట్ ముందున్న పెద్ద సవాలు.