మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ఫీజుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

మద్యం దుకాణాల లైసెన్సులను ఏడాది కాలానికి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుమును చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని ఓపెన్ క్యాటగిరీ షాపుల యజమానులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. లైసెన్సుల రెన్యువల్ ఫీజు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.