ప్రజా భవన్లో అమృత వర్షతో భేటీ: తెలంగాణ స్ఫూర్తిని ప్రశంసించిన భట్టి విక్రమార్క
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఖమ్మం
ప్రజా భవన్లో మై హెల్త్ ఇన్నోవేషన్స్ డైరెక్టర్ అమృత వర్ష తరిగొపులతో జరిగిన సమావేశం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆమె ఆత్మవిశ్వాసం, సంకల్పం, సాధించిన విజయాలు తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిని చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లోనూ ఇలాగే రాణించాలని, పట్టుదలతో ముందుకు సాగుతూ రాష్ట్ర కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు.