భువనేశ్వర్ లో భారీ శుభ్రత డ్రైవ్: 74 జలాశయాల పునరుద్ధరణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Bhubaneswar

భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నగరంలోని డెబ్బై నాలుగు జలాశయాలను సుందరీకరించేందుకు అధికారులు ప్రత్యేకంగా భారీ శుభ్రత డ్రైవ్ ను ప్రారంభించినట్లు డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రియబ్రత బెహెరా వెల్లడించారు. చెత్తాచెదారం, గుర్రపుడెక్కను తొలగిస్తూ పర్యావరణ హితంగా చెరువులను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు తెలిపారు. కార్తీక మాసం నేపథ్యంలో భక్తులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.