దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ ముఠాలపై సీబీఐ మెరుపు దాడులు

రిపోర్టర్: సతీష్ స్థలం: India

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లపై సీబీఐ 'ఆపరేషన్ చక్ర-VI' పేరుతో 20 రాష్ట్రాల్లో 89 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ప్రభుత్వ అధికారులమని నటిస్తూ బాధితులను నెలల తరబడి డిజిటల్ అరెస్ట్ చేసి రూ.42.36 కోట్లు కాజేసిన ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. కీలక బ్యాంకింగ్ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారుల కోసం విచారణను వేగవంతం చేశారు.