ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టులో ఊరట: బెయిల్ మంజూరు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. గతంలో నమోదైన ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆయనకు సుమారు అరవై ఏడు రోజుల అనంతరం ఊరట లభించింది. కోర్టు బెయిల్ ఉత్తర్వులు వెలువడటంతో ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.