భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

రిపోర్టర్: గోపి స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

రాష్ట్రంలో జెన్కోకు చెందిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు వరుసగా మూతపడుతున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని యూనిట్-1లో బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో అకస్మాత్తుగా రెండు వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదే ప్లాంట్లో ఇప్పటికే మరో యూనిట్ కూడా నడవడం లేదని, దీనివల్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని అధికారులు స్పష్టం చేశారు.