నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్: ఓటర్లకు జిల్లా ఎస్పీ భరోసా

రిపోర్టర్: రాజేష్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్ లో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా ముగిసిందని నంద్యాల ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఆయన పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించారు. ఓటర్లు ఎలాంటి భయాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది.