టీచర్లపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలంటూ వంగలపూడి అనిత హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: అనకాపల్లి

టీచర్లపై దాడులు చేయడం సరికాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అనకాపల్లిలో వంగలపూడి అనిత హెచ్చరించారు. డీఎస్సీ అంశంపై రాజకీయాల కోసం గురువులను టార్గెట్ చేయడం దారుణమని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీలో గానీ, కోర్టుల్లో గానీ ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ దాడులకు దిగడం అన్యాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె తేల్చిచెప్పారు.