దిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
భారత్ అధ్యక్షతన జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిల్లీకి చేరుకున్నారు. పాలమ్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రపంచ దేశాల నేతలతోనూ పుతిన్ భేటీ కానున్నారు.