రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించిన మంత్రి దుర్గేష్
రిపోర్టర్: విజయ్
స్థలం: తూర్పు గోదావరి
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి ఆయన బంతి భోజనాలు చేశారు. స్వయంగా అతిథులకు వడ్డించి, ఆంధ్రా వంటకాల గొప్పతనాన్ని వివరించారు. ఉమ్మడి గోదావరి జిల్లా ప్రసిద్ధ పూతరేకులను స్వయంగా తయారు చేసి వడ్డించడం అందరినీ ఆకట్టుకుందని మంత్రి తెలిపారు.